ఇస్లామాబాద్ : తమ దేశానికి చెందిన మిలిటరీ జనరల్స్ తాలిబాన్లకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారని ఆ దేశ మాజీ పార్లమెంటేరియన్ ఆఫ్రాసియాబ్ ఖట్టక్ ఆరోపించారు. అఫ్గానిస్థాన్‌లో నానాటికి పెరుగుతున్న తాలిబాన్ ఆక్రమణతో పాకిస్తాన్ చాలా సంతోషంగా ఉందని అవామీ నేషనల్ పార్టీ (ఏఎన్పీ) సభ్యుడు కూడా ఖట్టక్ (Afrasiab Khattak) అన్నారు. బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఖట్టక్ ఈ విషయాలను వెల్లడించి విస్మయపరిచాడు. ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్ వ్యూహానికి తాలిబాన్లు ఒక సాధనంగా మారబోతున్నారన్నారు. తాలిబాన్లకు పాకిస్తాన్ నుంచి ఆయుధాలు, డబ్బు, ఇతర సాయం చేస్తున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఐక్యరాజ్య సమితిలోని శాశ్వత రాయబారి గులాం ఇసాక్జాయ్ బాంబు పేల్చారు.
తాలిబాన్లు వాడుతున్న ఆయుధాలపై మేడిన్ పాకిస్తాన్ అని ముద్రించి ఉన్నట్లు ఖట్టక్.. ట్విట్టర్లో రెండు రోజుల క్రితం ఆరోపణలు చేశారు. తాలిబాన్ యోధులు తమ శిక్షణ, ఆయుధ సరఫరా మొత్తం పాకిస్తాన్‌పైనే ఆధారపడి ఉన్నారని రాసుకొచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విదేశీ సాయం లేకుండానే ఆఫ్ఘన్ దళాలు పోరాడుతున్నాయని, దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. గత వారం ఆఫ్ఘాన్ ఆర్మీ జరిపిన దాడుల్లో 30 మంది పాకిస్తాన్ పౌరులు చనిపోవడం ఖట్టక్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.
ఇలాఉండగా, పాకిస్తాన్ దురాగతాలపై తమ వద్ద అన్ని అధారాలు ఉన్నాయని ఐక్యరాజ్య సమితిలో ఆఫ్ఘనిస్తాన్ శాశ్వత రాయబారి గులాం ఇసాక్జాయ్ పేర్కొన్నారు. తాలిబాన్లకు పాకిస్తాన్ నుంచే ఆయుధాలు, మందుగుండు అందుతున్నదని, దీనికి సంబంధించిన రుజువులను చూపించాలని యూన్ అడిగితే.. చూపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ విషయంపై పాకిస్తాన్ ప్రభుత్వం తమ నిరసనను కూడా తెలిపామని ఆయన చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా తమ దేశంలో తాలిబాన్లు ఇంతగా రెచ్చిపోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తున్నది.
ఆఫ్ఘాన్ నుంచి పౌరుల తరలింపు మొదలెట్టిన అమెరికా
ఇంగ్లండ్‌లో తుపాకీ కాల్పులు.. ఆరుగురు మృతి
నువ్వెప్పుడు రాష్ట్రపతి అవుతావు మోదీ తాతా..?!
హెలీకాప్టర్ తయారు చేశాడు.. రెక్క తగిలి చనిపోయాడు..
ఈ హీరో రాకతో ఎగిరి గంతేసిన మీరాబాయి చాను.. ఎవరా హీరో తెలుసా?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..