పాక్ మాజీ చీఫ్ జస్టిస్ కాల్చివేత
Former chief justice shot dead: ఫెడరల్ షరియత్ కోర్టు మాజీ జస్టిస్, బలోచిస్తాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మొహమ్మద్ నూర్ మెస్‌కంజాయ్‌ను హత్య చేశారు. ఖారన్ పట్టణంలోని మసీదులో ప్రార్థనలు చేస్తుండగా ఆయనపై అటాక్ జరిగింది. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మసీదు బయట నుంచి కాల్పులు జరిగిన సమయంలో జస్టిస్
ఇస్లామాబాద్: ఫెడరల్ షరియత్ కోర్టు మాజీ జస్టిస్, బలోచిస్తాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మొహమ్మద్ నూర్ మెస్‌కంజాయ్‌ను హత్య చేశారు. ఖారన్ పట్టణంలోని మసీదులో ప్రార్థనలు చేస్తుండగా ఆయనపై అటాక్ జరిగింది. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మసీదు బయట నుంచి కాల్పులు జరిగిన సమయంలో జస్టిస్ నూర్ సోదరుడు హజీ ముంతాజ్ అహ్మద్ కూడా గాయపడ్డారు.
ఈ దాడికి తామే బాధ్యులమని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకున్నది. 66 ఏళ్ల మెస్కంజాయ్ మసీదులో ప్రార్థనలు చేస్తున్నప్పుడు అటాక్ జరిగినట్లు ఖరాన్ జిల్లా పోలీసు ఆఫీసర్ అసీమ్ హలీమ్ తెలిపారు. మెస్కంజాయ్ కడుపులో నాలుగు బుల్లెట్లు దిగాయి. కాల్పులు జరిపిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
జస్టిస్ మెస్కంజాయ్ రెగ్యులర్‌గా ప్రార్థనలు చేసే మసీదులోనే ఆయన ప్రార్థనలు చేశారని, కానీ దురదృష్టవశాత్తు మసీదు కిటికీ నుంచి ఆయన్ను కాల్చివేశారని పోలీసు ఆఫీసర్ తెలిపారు. మే 2019 నుంచి మే 2022 వరకు మెస్కంజాయ్ ఫెడరల్ షరియల్ కోర్టుకు 17వ చీఫ్ జస్టిస్‌గా చేశారు. రిబా ఆధారిత బ్యాంకింగ్ వ్యవస్థ షరియా చట్టానికి వ్యతిరేకంగా ఉన్నట్లు ఆయన తీర్పునిచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

