ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో గోధుమ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో అక్కడ తీవ్ర సంక్షోభం ఏర్పడింది. గోధుమ పిండి కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ఖైబర్ ఫక్తున్కా రాష్ట్రంలో అనేక చోట్ల అల్లర్లు చెలరేగాయి. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడి గోధుమ పిండి కోసం జనం భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. ఇప్పటికే మార్కెట్లో గోధుమ పిండి షార్టేజ్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
Pakistan में ये लड़ाई…ये झगड़ा…ये दंगे जैसे हालात आटे की बोरी के लिए हो रहे हैं…#PakistanEconomy #Pakistan pic.twitter.com/EzoI2LoSc9
— Jyot Jeet (@activistjyot) January 9, 2023
గోధుమ పిండి బ్యాగుల్ని సరఫరా చేస్తున్న ప్రదేశాల్లో జనం ఆ లారీలపైనే దాడి చేస్తున్నారు. పిండి సంచుల్ని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. జనం ఒకర్ని ఒకరు తోచుకుంటూ బ్యాగుల్ని ఎత్తుకెళ్లుతున్నారు. డీలర్ల షాపుల వద్ద పరిస్థితి అదుపు తప్పుతోంది. సర్కార్ కూడా ఏమీ చేయలేని స్థితికి చేరుకున్నది.
“आटा नहीं दे सकते तो हमारे ऊपर गाड़ी चढ़ा दो हमें ख़त्म करदो…” आटा नहीं मिलने पर Pakistan के लोग सड़कों पर लेटकर मरने की धमकी दे रहे है…#PakistanEconomy #Pakistan pic.twitter.com/zzWTJAHLCG
— Jyot Jeet (@activistjyot) January 9, 2023
కరాచీలో కిలో పిండి రూ.160కి అమ్ముతున్నారు. ఇస్లామాబాద్, పెషావర్ నగరాల్లో 10 కిలోల బ్యాగ్‌ను రూ.1500కు అమ్ముతున్నారు.పంజాబ్ ప్రావిన్సులోని మిల్లు ఓనర్లు గోధమ బ్యాగ్ ధరలను విపరీతంగా పెంచేశారు. అయినా గోధుమ బ్యాగులు ఎక్కడా స్టాక్ లేనట్లు తెలుస్తోంది.