Pakistan Elections | పాక్‌లో పూర్తికాని ఎన్నికల కౌంటింగ్.. అతి పెద్ద పక్షంగా షరీఫ్ పార్టీ
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్‌కు ఇప్పుడు మరో కష్టమొచ్చిపడింది. గురువారం జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీని కట్టబెట్టలేదు.
- కీలకంగా ఇమ్రాన్ మద్దతుదారులు..
Pakistan Elections | ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్‌కు ఇప్పుడు మరో కష్టమొచ్చిపడింది. గురువారం జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీని కట్టబెట్టలేదు. కౌంటింగ్ ఇంకా కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు ఇమ్రాన్‌కు చెందిన పీటీఐ పార్టీ మద్దతుదారులు 99 సీట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. కానీ పార్టీ పరంగా పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ 71 సీట్లతో అగ్రస్థానంలో ఉంది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ 53 స్థానాల్లోనూ, ముత్తాహిదా క్వామి మూవ్మెంట్ 17 స్థానాల్లోనూ, మిగిలిన స్థానాల్లో చిన్న చిన్న పార్టీలు గెలుపొందాయి.
పీటీఐ మద్దతుతో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు ఏ పార్టీలోనైనా చేరే అవకాశమున్నది. మరోసారి ప్రధా ని కావాలని పీఎంఎల్-ఎన్ చీఫ్ నవాజ్ షరీఫ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి తన చిన్న కొడుకు, పార్టీ అధినేత అయిన బిలావల్ భుట్టో జర్దారిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాడు. ఏ పార్టీలో చేరాలనే విషయమై పీటీఐ నాయకత్వం అంతర్గతంగా సంప్రదింపులు ప్రారంభించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

