Khawaja Muhammad Asif | ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్ర దాడి తర్వాత ఏ క్షణంలోనైనా భారత్‌తో యుద్ధం ప్రారంభమయ్యే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా మహ్మద్ ఆసిఫ్ శుక్రవారం భారత్‌ను మరోసారి బెదిరించారు.
సింధూ నదీ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్ ఆ నదిపై నిర్మించే ఎలాంటి కట్టడాన్నైనా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. జియో న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘సింధూ నదిపై ఎలాంటి నిర్మాణం జరిగినా దాన్ని భారత దూకుడు చర్యగానే చూస్తాం’అని అన్నారు.