లండన్: అట్లాంటిక్ సముద్ర గర్భంలో పేలిన టైటాన్ సబ్‌లో పాకిస్థాన్ బిలియనీర్ తండ్రీకొడుకులు ఉన్న విషయం తెలిసిందే. 48 ఏళ్ల వ్యాపారవేత్త షహజాదా దావూద్ తో పాటు ఆయన కుమారుడు సులేమాన్ దావూద్(Suleman Dawood) టైటానిక్ ట్రిప్‌కు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. అయితే సులేమాన్ ఆ జర్నీ చేపట్టేందుకు చాలా భయపడ్డాడని అతని మేనేత్త అజ్మే దావూద్ తెలిపింది. తీవ్రమైన వత్తిడి వల్ల టైటాన్ సబ్ సముద్ర గర్భంలో పేలి పోయింది. ఆ ఘటనలో మొత్తం అయిదుగురు మృతిచెందారు.
సాహసయాత్ర చేపట్టానికి ముందు సులేమాన్ దావూద్ చాలా భయాందోళనకు గురైనట్లు మేనత్త తెలిపింది. టైటాన్ సబ్ ఘటన పట్ల షహజాద్ దావూద్ సోదరి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సోదరుడు షహజాద్‌కు టైటానిక్ అంటే ఇష్టమని, అయితే తండ్రిని సంతృప్తిపరిచేందుకు ఫాడర్స్ డే సందర్భంగా టైటాన్ ట్రిప్‌కు వెళ్లేందుకు సులేమాన్ ఒప్పుకున్నట్లు ఆమె చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా టైటాన్ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చినట్లు షహజాద్ దావూద్ సోదరి అజ్మే తెలిపారు.
— Dawood Foundation (@DawoodTdf) June 23, 2023