Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాక్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
Afghanistan: పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడింది. ఆఫ్ఘనిస్తాన్పై అటాక్ చేసింది. ఆ దాడిలో సుమారు 13 మంది మృతిచెందారు. దీంట్లో 11 మంది చిన్నారులు ఉన్నారు. ఖోస్త్, కునార్, పక్తికా ప్రావిన్సులపై అటాక్ జరిగినట్లు తాలిబన్ సర్కారు తెలిపింది.
కాబూల్: పాకిస్థాన్ బుధవారం చేపట్టిన దాడుల్లో సుమారు 13 మంది మృతిచెందినట్లు ఆఫ్ఘనిస్తాన్(Afghanistan) ప్రకటించింది. ఆ దాడిలో మరో 14 మంది గాయపడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్లోని ఖోస్త్, కునార్, పక్తికా ప్రావిన్సులను టార్గెట్ చేసినట్లు తాలిబన్ చీఫ్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. ఈ దాడుల్లో 11 మంది చిన్నారులు, ఓ మహిళ, ఓ వృద్ధుడు చనిపోయినట్లు చెప్పారు. ఈ దాడుల గురించి పాకిస్థాన్ ఎటువంటి ప్రకటన చేయలేదు.
గత ఫిబ్రవరి నుంచి పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య తీవ్ర ఫైటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ పోరులో వందల సంఖ్యలో జనం మృతిచెందారు. పాక్ జరిపిన వైమానిక దాడులకు కౌంటర్‌గా ఆఫ్ఘనిస్తాన్ సీమాంతర అటాక్ చేసింది. పాకిస్థాన్‌లో జరుగుతున్న ఉగ్రదాడులకు కారణమైన ఉగ్రవాదులను ఆఫ్ఘనిస్తాన్ పెంచి పోషిస్తున్నట్లు పాక్ ఆరోపిస్తున్నది. పాకిస్థానీ తాలిబన్ అలియాస్ తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ వ్యవస్థ దాడులు చేస్తున్నట్లు పాక్ పేర్కొన్నది. ఆఫ్ఘన్ తాలిబన్‌తో ఆ సంస్థకు లింకు ఉన్నట్లు పాక్ ఆరోపిస్తున్నది. కానీ కాబూల్ మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

