భారత్కి చెందిన ఓ క్షిపణి పాక్లో పడ్డ సంగతి తెలిసిందే. సాంకేతికత కారణంగా, పొరపాటున జరిగిన ఘటన అని భారత ప్రభుత్వం విచారం కూడా వ్యక్తం చేసింది. ఇదే విషయంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురీషీ మళ్లీ స్పందించారు. పాక్లో పడ్డ క్షిపణిపై సంయుక్తంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. భారత రక్షణ మంత్రి ఈ విషయంలో ఇచ్చిన వివరణ అసంపూర్తిగా ఉందని, అది ఏమాత్రం సరిపోదన్నారు. ఈ విషయంపై సంయుక్త విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ లోక్సభ వేదికగా చేసిన ప్రకటన అసంపూర్తిగా ఉంది. ఏమాత్రం సరిపోదు. మాకు సంతృప్తి ఇవ్వలేదు. అది బాధ్యతా రాహిత్య సమాధానం. సంయుక్త విచారణ చేపట్టాల్సిందే. ఇలా భారత క్షిపణి పాక్లో పడటం బాధ్యతా రాహిత్యమైన చర్య అంటూ పాక్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు.
భారత్కు చెందిన సూపర్ సోనిక్ మిస్సైల్ ఒకటి పాక్లో పడింది. 124 మీటర్ల అవతల పాక్లో కూలింది. అయితే సాంకేతికత కారణంగా, పొరపాటున మాత్రమే అది పాక్లో పడిందని భారత ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అంతేకాకుండా ఈ విషయంపై అత్యున్నత స్థాయి విచారణకు కూడా ఆదేశిస్తున్నామని భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.