ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పుందట. మాజీ మంత్రి, ఇమ్రాన్ సన్నిహితుడు ఫైసల్ వడావా చేసిన వ్యాఖ్యలివి. ఇమ్రాన్ ను హత్య చేయడానికి కొందరు పథక రచన చేస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పాక్‌లోని ఓ టీవీ ఛాలన్ డిబేట్లో ఫైసల్ వడావా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇమ్రాన్ ప్రాణాలకు ముప్పుందని ప్రకటించారు.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హఠాత్తుగా తన నిర్ణయానికి మార్చుకున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం బుధవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే.. ఈ నిర్ణయాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. జాతినుద్దేశించి ప్రసంగించడం లేదని పాక్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే.. పాక్ ఆర్మీ చీఫ్ బాజ్వా ప్రధాని ఇమ్రాన్‌తో భేటీ అయిన తర్వాత ఈ నిర్ణయం వెలువడటం గమనించాల్సిన అంశం. మరోవైపు స్పెషల్ కేబినెట్ భేటీని కూడా ఇమ్రాన్ నిర్వహించారు.