కిక్కిరిసిన ఐసీయూలు, శ్మశానవాటికలు.. చైనీస్ పట్టణాల్లో పరిస్థితి దారుణం
Packed ICUsచైనాలో ఇప్పుడు మళ్లీ కోవిడ్ కేసులు పెరిగిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ హాస్సిటళ్లు కిక్కిరిసిపోతున్నాయి. హుబై ప్రావిన్సులో పరిస్థితి చాలా భయానకంగా ఉందని తెలుస్తోంది. జ్వరంతో బాధపడుతున్న
బాజూ: చైనాలో ఇప్పుడు మళ్లీ కోవిడ్ కేసులు పెరిగిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ హాస్సిటళ్లు కిక్కిరిసిపోతున్నాయి. హుబై ప్రావిన్సులో పరిస్థితి చాలా భయానకంగా ఉందని తెలుస్తోంది. జ్వరంతో బాధపడుతున్న పేషెంట్లు చికిత్స కోసం హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతున్నారు. బీజింగ్ సమీపంలో ఉన్న పట్టణంలో.. హాస్పిటళ్లలోని ఎమర్జెన్సీ వార్డులు నిండిపోయాయి. వ్యాధితో ఇబ్బందిపడుతున్న రోగులు.. హాస్పిటళ్లలో ఓపెన్ బెడ్స్ కోసం ఎదురుచూస్తున్నారు. హాస్పిటల్ కారిడార్లలో ఉన్న బెంచ్‌లపై కూడా పేషెంట్లను ట్రీట్ చేస్తున్నారు.
స్థానిక హాస్పిటళ్లలో రోగులు ఊపిరితిత్తుల స్కాన్లు చేయించుకుంటున్నారు. అయితే సీరియస్ కేసుల్ని ట్రీట్ చేయడం ఇబ్బందికరంగా మారుతోంది. చిన్న చిన్న పట్టణాల్లో ఉన్న ఆస్పత్రులు.. రోగుల్ని పెద్ద నగరాలకు పంపుతున్నారు. బ్రీతింగ్ సమస్యలతో చాలా మంది పేషెంట్లు బాధపడుతున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు అక్కడి పరిస్థితిని భయానకంగా వర్ణిస్తున్నారు. హాస్పిటళ్లు, శ్మశానవాటికల్లో పరిస్థితి దారుణంగా ఉన్నట్లు చెబుతున్నారు.
బావోడింగ్, లాంగ్‌ఫాంగ్ జిల్లాల్లో కరోనా రోగుల అవస్థలు చెప్పలేని రీతిలో ఉన్నాయి. వచ్చే ఏడాదిలోపు చైనాలో సుమారు 20 లక్షల మంది మరణించే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. రోగుల్ని లెక్కిస్తున్న తీరు సరిగా లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా తీరును ఖండిస్తోంది. చాలా వరకు పేషెంట్లు రెస్పిరేటర్లకు అతుక్కుపోతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

