వాషింగ్టన్: నియంత్రణ కోల్పోయిన ఓ స్పేస్ఎక్స్ రాకెట్‌తో భారత్‌కు చెందిన చంద్రయాన్, నాసాకు చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటార్‌కు ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుతం ఈ రెండు చంద్రుడి చుట్టూ తిరుగుతూ జాబిల్లికి చెందిన కీలక సమాచారం సేకరిస్తున్నాయి. అయితే స్పేస్ఎక్స్ రాకెట్‌తో వీటికి ప్రమాదం ఏర్పడింది. ఆ రాకెట్ చంద్రుడిని కూడా ఢీకొట్టే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2015 ఫిబ్రవరిలో ఫాల్కన్ 9 రాకెట్‌ను ప్రయోగించారు. ఇది రెండో దశలో విఫలమైంది. దీంతో నియంత్రణ కోల్పోయి రోదసిలో అస్తవ్యస్తంగా తిరుగుతున్నది.