ఇస్లామాబాద్: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న ఈ సమయంలో తాము భారత ప్రజల కోసం ప్రార్థిస్తున్నామని అన్నారు పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి ఫవద్ హుస్సేన్. ఈ కష్ట సమయంలో మా భారత ప్రజల కోసం మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు దయ చూపాలి. త్వరలోనే ఈ కష్టాలు తొలగిపోవాలి అని ఆయన శనివారం ట్వీట్ చేశారు. ఇండియాలో కరోనా కేసులు రోజుకో రికార్డు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో ఏకంగా 3.42 లక్షల కేసులు నమోదయ్యాయి. అటు పాకిస్థాన్లోనూ కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా మహమ్మారి విరుచుకుపడినప్పటి నుంచీ ఎప్పుడూ లేని విధంగా పాకిస్థాన్లో ఒకే రోజులో 157 మంది మృత్యువాత పడ్డారు.
In these difficult times our prayers are with people of #India may God be kind and may these difficult times gets over soon. #coronavirus
— Ch Fawad Hussain (@fawadchaudhry) April 24, 2021