జపాన్‌లోని టోక్యోలో ఓ దుండగుడు దారుణానికి ఒడిగట్టాడు. ముగ్గురు డాక్టర్లపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం వాళ్లను బంధించడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వాళ్లను కాపాడటం కోసం 11 గంటల పాటు పోరాడారు. చివరకు ఆ దుండగుడు ముగ్గురిలో ఒకరి ప్రాణాలు తీసి తప్పించుకోబోగా చాకచక్యంగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
66 ఏళ్ల వయసు ఉన్న ఓ దుండగుడు గురువారం రాత్రి 9 గంటల సమయంలో ముగ్గురు డాక్టర్లపై దాడి చేశాడు. అందులో ఒకరు దుండగుడి ఫిజిషియన్‌గా గుర్తించారు. అతడిని ఆ దుండగుడు గన్‌తో కాల్చి చంపేశాడు. అతడికి 44 ఏళ్ల వయసు ఉంటుందని.. అతడు మెడికల్ వర్కర్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
దుండగుడి వద్ద బంధీలుగా ఉన్న ముగ్గురు డాక్టర్లను కాపాడేందుకు పోలీసులు గురువారం రాత్రి 9 నుంచి శుక్రవారం ఉదయం వరకు ప్రయత్నించారు. దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. చివరకు ఆ దుండగుడిని శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. అప్పటికే ముగ్గురిలో ఒక డాక్టర్ స్పృహ లేకుండా పడి ఉన్నాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
హంటింగ్ గన్‌తో హిరోషీ అనే దుండగుడు ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. గాయపడిన మరో ఇద్దరు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.