Icon of the Seas |పోన్స్ (ప్యూర్టో రికో), జనవరి 20: టైటానిక్ ఓడతో పోల్చితే ఐదు రెట్లు పెద్దది, 20 అంతస్తులు (డెక్స్) కలిగిన అత్యంత విలాసవంతమైన భారీ ఓడ ‘ఐకాన్ ఆఫ్ ద సీస్’ ప్రయాణికుల కోసం సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఓడగా రికార్డు సృష్టించిన ‘ఐకాన్ ఆఫ్ ద సీస్’ మొదటి సముద్ర ప్రయాణం ఈ నెల 27న మియామి (అమెరికా) నుంచి మొదలుకానున్నది. ప్రయాణికులకు అత్యధ్భుతమైన అనుభూతిని కలిగించే సెంట్రల్ పార్క్, వాటర్ పార్క్, థ్రిల్ ఐలాండ్, స్విమింగ్ ఫూల్స్..ఇలా 8 రకాల సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ఐకాన్ ఆఫ్ సీస్..కరీబియన్ దీవుల్లోని ‘పోన్స్’ (ప్యూర్టో రికో)కు చేరుకోగా, అక్కడ అధికారులు కొన్ని తనిఖీలు నిర్వహించారు.
అంతస్తులు.. 20
పొడవు.. 365 మీటర్లు
గదులు : 2805
బరువు : 2,50,800 టన్నులు
ప్రయాణికుల సామర్థ్యం : 7,600
పనిచేసే సిబ్బంది : 2,350
నిర్మాణం : రాయల్ కరీబియన్ ఇంటర్నేషనల్కంపెనీ
నిర్మాణ ఖర్చు : రూ. 16,624 కోట్లు
ఇంధనం : ద్రవరూప సహజవాయువు