న్యూయార్క్: అమెరికాలో ఓమిక్రాన్ వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. సుమారు 30 రాష్ట్రాల్లో ఆ వేరియంట్ కేసులను గుర్తించారు. ఇక అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 మిలియన్లు దాటినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. ఒమిక్రాన్ ఆందోళనకరమైన వేరియంట్ అని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇక బ్రిటన్లో ఒమిక్రాన్ తొలి మరణం నమోదు అయినట్లు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. చాలా వేగంగా ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తంగా ఉన్నాయి.