నోయిడా: యూపీలోని నోయిడాలో ఒక ప్రైవేట్ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులను నిర్వాహకులు గదుల్లో బందీలుగా చేశారు. వారిలో కొందరు చేతులు కట్టేయడంతో వారు ఎక్కడకు కదల్లేని పరిస్థితుల్లో మలమూత్రాలతో నిండిన బట్టలతో కన్పించారు. ఈ దారుణ ఘటన ఆనంద్ నికేతన్ వృద్ధాశ్రమంలో చోటుచేసుకుంది. ఈ ఆశ్రమంలో వృద్దుల పరిస్థితి దయనీయంగా ఉందని ఇటీవల సామాజిక మాధ్యమంలో వీడియోలు వైరల్ కావడంతో మహిళా కమిషన్, నోయిడా పోలీసులు స్పందించి గురువారం దాడులు నిర్వహించి, అక్కడ ఉన్న 39 మంది వృద్దులను రక్షించారు.
జపాన్ ‘ట్విట్టర్ కిల్లర్’కు ఉరి ; 9 మందిని చంపినందుకు శిక్ష
టోక్యో: సోషల్ మీడియాలో పరిచయం చేసుకొన్న 9 మందిని హత్య చేసిన ఓ వ్యక్తికి జపాన్ శుక్రవారం ఉరి శిక్ష అమలు చేసింది. 2017లో 8 మంది మహిళలు, ఓ పురుషుడిని టకహిరో షిరాయిషి అనే వ్యక్తి జామా సిటీలోని తన అపార్ట్మెంట్లో హత్య చేశాడు. ‘ట్విట్టర్ కిల్లర్’గా పేరున్న హంతకుడు అశాంతిని కలిగించడాన్ని పరిగణనలోనికి తీసుకుని అతడికి ఉరి శిక్ష నిర్ణయం తీసుకున్నట్టు న్యాయ శాఖ మంత్రి కీసుకే సుజుకీ వెల్లడించారు. మూడేండ్ల తర్వాత జపాన్లో ఉరిశిక్షను అమలు చేశారు.