వ్లాదివోస్తాక్, సెప్టెంబర్ 7: రష్యా ఇంధన ఉత్పత్తుల ధరలపై పరిమితులను విధించే దేశాలకు చమురు, గ్యాస్ సరఫరా నిలిపివేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. రష్యా ఆదాయానికి గండి కొట్టడంలో భాగంగా ఆ దేశ ఇంధన ఉత్పత్తుల ధరలపై పరిమితి విధించాలని పాశ్చాత్య దేశాలు యోచిస్తున్న నేపథ్యంలో పుతిన్ ఈ హెచ్చరిక చేశారు. రష్యా ఇంధన ఉత్పత్తుల ధరలపై పరిమితి విధించడం తెలివితక్కువ నిర్ణయమే అవుతుందని పేర్కొన్నారు. రష్యా ఆర్థిక ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే దేశాలకు చమురు, గ్యాస్, బొగ్గు, ఇతర ఇంధనాలను సరఫరా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.