ప్యాంగాంగ్: ఉత్తరకొరియాలో ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పాలన గురించి తెలియనివారు ఉండరు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న కొందరు నియంతల్లో కిమ్‌ను మించినవారు లేరు. ఆ దేశ పౌరులు ఏ చిన్న పొరపాటు చేసినా జోంగ్ వేసే శిక్షలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు చేశాడని సొంత బాబాయినే పెంపుడు కుక్కలతో కరిపించి చంపించిన చరిత్ర కిమ్‌ది. తాజాగా మరోసారి కిమ్ క్రూరత్వం బయటపడింది.
పోర్న్ వీడియోలు చూస్తూ పట్టుబడిన ఓ బాలుడికి, అతని కుటుంబానికి అత్యంత భయంకరమైన శిక్ష విధించాడు కిమ్.
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఉత్తరకొరియా ప్రభుత్వం ఆ దేశ పౌరులు పోర్న్ చూడటాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. అందులోభాగంగా అధికార వర్కర్స్ పార్టీ పాఠశాలల్లో అశ్లీలతకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఎందుకంటే నియంత కిమ్ జోంగ్ ఉన్ ఉద్దేశంలో పోర్న్ చూడటం అంటే సమాజాన్ని నాశనం చేయడం. అందుకే ఆయన తన దేశంలో పోర్న్‌పై నిషేధం విధించారు.
అయితే, అనూహ్యంగా ఇటీవల ఒక బాలుడు పోర్న్ చూస్తూ అడ్డంగా దొరికిపోయాడు. కంప్యూటర్ ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులు అతడి ఇంటి చిరునామాను ట్రేస్ చేశారు. బాలుడి పోర్న్ చూసి పట్టుబడ్డాడన్న విషయం నియంత కిమ్ దృష్టికి వెళ్లడంతో సదరు బాలుడికి, అతని కుటుంబానికి ఆయన భయంకరమైన శిక్షను విధించాడు. ఆ కుటుంబానికి దేశ బహిష్కరణ శిక్ష విధించడమే గాకుండా, దేశ సరిహద్దులు దాటి వెళ్లిపోయేవరకు వారిని తరిమేయించాడు.
అంతేగాక ఆ బాలుడు చదివిన పాఠశాల ప్రిన్సిపాల్‌కు సైతం కిమ్ శిక్ష విధించాడు. ఎందుకంటే ఉత్తరకొరియా చట్టాల ప్రకారం.. పాఠశాల పిల్లలు ఏదైనా తప్పుచేస్తే దానికి పాఠశాల ప్రిన్సిపాలే బాధ్యత వహించాలి. ఆ మేరకే ప్రిన్సిపాల్‌కు శిక్ష విధిస్తూ అతడిని కార్మిక శిబిరానికి తరలించారు.