ప్యోంగ్యాంగ్: కొత్త సంవత్సరం 2022కి ఉత్తర కొరియా ఘనంగా స్వాగతం పలికింది. టెడాంగ్ నది సమీపంలో భారీగా బాణసంచా కాల్చారు. ఆ దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో నదీ సమీపానికి తరలివచ్చారు. కొత్త ఏడాదికి స్వాగతం పలికే కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులతో సహా అంతా ఆ దేశ జెండాను చేతపట్టి రెపరెపలాడించారు. ప్రజలంతా తమ ముఖాలకు మాస్కులు ధరించారు. కాగా, కఠిన ఆంక్షలు విధించే ఉత్తర కొరియాలో పెద్ద ఎత్తున న్యూఇయర్ 2022కి స్వాగతం పలకడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
#WATCH | North Korea welcomes #NewYear2022 with a firework display near the Taedong River
— ANI (@ANI) December 31, 2021
(Source: Reuters) pic.twitter.com/d29i9Qw7Ss