North Korea PM : శత్రు దేశాలైన ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య మరోసారి మాటల యుద్ధానికి తెరలేచింది. ఈ సారి దక్షిణ కొరియా ప్రధాని హన్ డక్ సూ దాయాదిపై సంచలన ఆరోపణలు చేశారు. లండన్‌కు చెందిన స్కై న్యూస్‌తో మాట్లాడుతూ… ఉత్తరకొరియా అణ్వాయుధాన్ని పరీక్షించేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఎప్పుడు టెస్ట్ చేస్తుందనేది కచ్చితంగా చెప్పలేం. వాళ్లు న్యూక్లియర్ వెపన్ టెస్ట్ కోసం సన్నద్ధంగా ఉన్నారని మాకు తెలిసింది అని ఆయన అన్నారు. అయితే ఎప్పుడు ప్రయోగిస్తుందనేది తెలియదని అయన వెల్లడించారు. 2017లో మొదటిసారిగా ఉత్తర కొరియా అణ్వాయుధాలను పరీక్షించింది.
ఇర దేశాల మధ్య ఏళ్లుగా కొరియా ద్వీపకల్పం గురించి వివాదం నడుస్తోంది. 2011లో కిమ్ జాంగ్ ఉన్ ఉత్తర కొరియా అధ్యక్షుడు అయ్యాక సైన్యాన్ని ఆధునీకరించే చర్యలు చేపట్టాడు. ఈ క్రమంలోనే దక్షిణ కొరియా, అమెరికా లక్ష్యంగా నవంబర్ నెలలో ఉత్తర కొరియా క్షిపణులను పరీక్షించింది. వీటిలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. దాంతో, అప్పటి నుంచి ఇరు దేశాల నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అంతేకాదు అమెరికాతో పాటు పలు దేశాలు ఉత్తర కొరియా దుందుడుకు చర్యలను ఖండించాయి.