North Korea: బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
North Korea: ఉత్తర కొరియా ఇవాళ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. జపాన్ సముద్ర జలాల దిశగా ఆ మిస్సైల్‌ను టెస్ట్ చేసింది. ఈ ఏడాది బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడం ఇది మూడవసారి.
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా(North Korea) ఇవాళ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. జపాన్ సముద్ర జలాల దిశగా ఆ మిస్సైల్‌ను టెస్ట్ చేసింది. ఆ క్షిపణి ప్రొజెక్టైల్ సముద్ర జలాల్లో పడినట్లు జపాన్ రక్షణ మంత్రి తెలిపారు. ఉత్తర కొరియా పశ్చిమ తీరం నుంచి దాన్ని పరీక్షించినట్లు తెలుస్తోంది. విమానాలకు కానీ నౌకలకు కానీ ఎటువంటి నష్టం జరగలేదని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఏడాది బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడం ఇది మూడవసారి. ఆ క్షిపణికి హైపర్సోనిక్ వార్‌హెడ్‌ను అమర్చినట్లు దక్షిణ కొరియా మిలిటరీ అధికారులు వెల్లడించారు. సుమారు 600 కిలోమీటర్ల దూరం ఆ క్షిపణి ప్రయాణించి ఉంటుందని అంచనా వేశారు.
జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఈ ప్రయోగాన్ని ఖండించారు. ఉత్తర కొరియా ఈ ఏడాది చాలా సార్లు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని, దీంతో ప్రాంతీయ భద్రతకు ముప్పు ఉందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోమని ఆయన అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

