స్టాక్‌హోమ్: ఇరాన్లో మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నర్గెస్ మొహమ్మది(Narges Mohammadi)కి ఈ యేటి నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇవాళ నార్వే నోబెల్ కమిటీ ఈ ప్రకటన చేసింది. ఇరాన్లో మానవ హక్కులు, అందరికీ స్వేచ్ఛ అన్న నినాదాంతో ఆమె ఉద్యమం నడిపారు. మానవ హక్కుల అడ్వకేట్‌గా ఆమె ఇరాన్లో పాపులర్. ఫ్రీడం ఫైటర్ కూడా. టెహ్రాన్‌లోని ఎవిన్ జైలులో గత ఏడాది రాజకీయ ఖైదీలను బంధించారు, ఆ సమయంలో జరిగిన నిరసనల్లో మొహమ్మది పాల్గొన్నారు. వుమెన్-లైఫ్-ఫ్రీడం నినాదంతో ఆమె నిరసనలు చేపట్టారు.
మహిళల హక్కుల కోసం పోరాటం చేసిన నర్గెస్.. తన జీవితాన్ని జైలుకే అంకితం చేసింది. ఆమెను దాదాపు 13 సార్లు ఇరాన్ సర్కార్ అరెస్టు చేసింది. అయిదు సార్లు ఆమెను దోషిగా నిర్దారించారు. ఆమెకు దాదాపు 31 ఏళ్ల జైలుశిక్షను వేశారు. 154 కొరడా దెబ్బలు కూడా తిన్నది. ప్రస్తుతం మొహమ్మది ఇంకా జైలులోనే ఉన్నారు.