లండన్: బ్రిటన్ను డ్రైవర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. రిఫైనరీల నుంచి ఇంధనాన్ని పెట్రోల్ బంకులకు చేర్చడానికి ట్రక్కు డ్రైవర్లు లేరు. బంకుల్లో పెట్రోల్ అయిపోతుందన్న భయంతో బ్రిటన్ పౌరులు సోమవారం బంకుల ముందు బారులు తీరారు. కిలోమీటర్ల మేర కార్ల లైన్లు కనిపించాయి. వాహనదారుల తాకిడితో బ్రిటన్లో దాదాపు 90% బంకులను మూసివేశారు. బ్రెగ్జిట్ అనంతరం బ్రిటన్లో డ్రైవర్ల కొరత మొదలైంది. ఇంధన, ఆహార పదార్థాల రవాణా మందగించడంతో వాటి రేట్లు పెరుగుతున్నాయి. దీంతో 5వేల మంది విదేశీ డ్రైవర్లకు తాత్కాలిక వీసాలు ఇస్తామని బ్రిటన్ ప్రకటించింది.