వాషింగ్టన్, జూలై 5: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించి, పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహల్ మోదీని అమెరికా పోలీసులు ఈ నెల 4న అరెస్ట్ చేశారు. అమెరికా న్యాయ శాఖ తెలిపిన వివరాల ప్రకారం బెల్జియన్ జాతీయుడైన నేహల్.. మనీ లాండరింగ్, నేరపూరిత కుట్ర, సాక్ష్యాధారాల ధ్వంసం ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. నేర ప్రతిఫలాన్ని లాండరింగ్ చేయడంలో నేహల్ కీలకపాత్ర పోషించినట్టు ఈడీ, సీబీఐ ఆరోపించాయి. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, నేహల్, మరికొందరు పీఎన్బీని రూ.13,500 కోట్ల మేరకు మోసగించినట్టు సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.