వాషింగ్టన్: అమెరికాలోని మినియాపోలిస్‌లో రెనీ నికోలో గుడ్(Renee Nicole Good) అనే మహిళను అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) ఏజెంట్ ఒకరు కాల్చి చంపిన ఘటన తెలిసిందే. ఈ ఘటనకు చెందిన కొత్త వీడియోను అమెరికా ప్రభుత్వం రిలీజ్ చేసింది. అయితే ఆ మహిళ రోడ్డుకు అడ్డంగా కారును నిలిపి, హారన్ బ్లో చేసినట్లు ఆ వీడియోలో ఉన్నది. మంచుతో నిండిన రోడ్డుపై ఫెడరల్ ఆఫీసర్లు అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో రెనీ గుడ్ హత్యకు గురైంది. ప్రస్తుతం అమెరికాలో ఈ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ ఆత్మరక్షణలో భాగంగా షూట్ చేశాడా లేక నిర్లక్ష్యంగా వ్యవహరించాడా అన్న కోణంలో అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కొత్తగా రిలీజైన వీడియో మూడున్నర నిమిషాలు నిడివి ఉన్నది. అక్కడ ఉన్న ఓ వ్యక్తి ఆ వీడియోను తీశాడు. హోంల్యాండ్ సెక్యూర్టీ శాఖ ఈ వీడియోను తమ ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది. అయితే రోడ్డుపై ఓ మహిళ తన కారును అడ్డంగా ఆపి, హారన్ బ్లో చేసింది. కారులో ఉన్న మహిళను రెనీ గుడ్‌గా గుర్తించారు. ఓ నిమిషం పాటు పదేపదే హారన్ మోగించిన ఆమె ఆ తర్వాత తన కారును కొద్దిగా వెనక్కి తీసుకున్నది. అక్కడ నుంచి రెండు వెహికిల్స్ వెళ్లిపోయాయి.
ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ తీసిన వీడియోలో.. ఓ ఆఫీసర్ గుడ్ను కారు దిగాలని కోరారు. మరో ఆఫీసర్ ఆ కారు డోర్‌ను తీసే ప్రయత్నం చేశారు. వీడియో తీస్తున్న ఆఫీసర్ ఆ వాహనం చుట్టూ తిరిగారు. ఆ తర్వాత కాల్పులు శబ్ధం వినిపిస్తుంది.
Let’s check the tape.
For more than 3 minutes the anti-ICE agitator impeded a law enforcement operation with her vehicle. https://t.co/o2Lb0SQIvS pic.twitter.com/CQ2nxP6UHE
— Homeland Security (@DHSgov) January 11, 2026