న్యూఢిల్లీ: అమెరికాలోని న్యూజెర్సీలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తున్నది. దీంతో బుధవారం వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రద్దీగా ఉండే గార్డెన్ స్టేట్ హైవేను మంగళవారం రాత్రి బర్నెగాట్-లాసే టౌన్షిప్స్ మధ్య తాత్కాలికంగా మూసివేశారు.
దీనిని తిరిగి తెరిచినట్లు ఓషన్ కౌంటీ షెరిఫ్ కార్యాలయం బుధవారం తెలిపింది. 1,300కుపైగా భవనాలు దెబ్బతిన్నాయి. సుమారు 3,000 మందిని ఇక్కడి నుంచి ఖాళీ చేయించారు. రెండు హైస్కూళ్లలో వీరికి ఆశ్రయం కల్పించినట్లు బర్నెగాట్ పోలీసులు తెలిపారు.