బీజింగ్: చైనాలో ఇప్పుడు డేటింగ్ అంశంలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. అపరిచితులు కిస్సింగ్ ఇచ్చుకుంటున్నారు. దీన్నే మౌత్ బడ్డీస్ అంటున్నారు. స్థానిక మాండరిన్ భాషలో దీన్ని జుయి యూ అని పిలుస్తున్నారు. ఆన్లైన్ ద్వారా కలుసుకుంటున్న జనం.. కిస్సింగ్ సెషన్స్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ట్రెండ్‌పై కొందరు ఆందోళనలు చెందుతున్నారు.
మౌత్ బడ్డీ అంటే కేవలం ముద్దులు ఇవ్వడం మాత్రమే అని, దీంట్లో ఎటువంటి రిలేషన్షిప్ కానీ, శృంగారం కానీ ఉండదని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. కిస్సింగ్ సెషన్స్ ముగిసిన తర్వాత చాలా వరకు జంటలు మళ్లీ భౌతికంగా కలుసుకోవడం లేదని అంటున్నారు.
కొందరు కిస్సులు ఇచ్చుకుంటారని, కానీ వాళ్లు లవర్స్ కారు అని, కిస్సింగ్ కామన్ అని, దీంట్లో పెద్ద సమస్య ఏదీలేదని ఓ యూనివర్సిటీ విద్యార్థి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్ని ఎంజాయ్ చేయడం ముఖ్యమని, పార్ట్నర్కు కిస్ ఇవ్వడం అంటే, ప్రేమించే వ్యక్తికి కిస్ ఇవ్వడంలా అనిపిస్తుందని ఆ వ్యక్తి తెలిపారు. ముద్దులు ఇచ్చుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఫ్రీ అవుతామని, శృంగారంతో పోలిస్తే దీని వల్ల ఎటువంటి సమస్యలు ఉండవన్నారు.