Nepal flood : నేపాల్లో ఆకస్మిక వరద బీభత్సం సృష్టించింది. వరద కారణంగా ఒక ఊరు కొట్టుకుపోయింది. ఈ ఘటన నేపాల్-టిబెట్ సరిహద్దులోని రసువా జిల్లాలోని ఒక గ్రామంలో బుధవారం ఉదయం 9.00 గంటలకు జరిగింది. ఆకస్మికంగా సంభవించి వరద కారణంగా ఊరు కొట్టుకుపోగా.. ఊరిలోని 1,000 మంది వరకు ఇందులో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వీరి పరిస్థితి గురించిన సమాచారం ఇంకా వెల్లడికాలేదు.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే, చుట్టుపక్కల ప్రాంతంలోని ప్రజలు సురక్షిత, ఎగువ ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. ఈ ఘటన జరిగింది నేపాల్లోని రసువా జిల్లాలోని స్యాప్రు బేసి, టిమురే ప్రాంతాల్లో. ఇది పర్వత ప్రాంతం. పైగా ఇక్కడ భోటె కోషి అనే నది ఉంది. ఈ నది టిబెట్ నుంచి నేపాల్వైపు ప్రవహిస్తుంది. ఈ నదిలో నీరు ఉప్పొంగడంతోపాటు, దిగువ లోయ ప్రాంతం కావడం వల్ల ఇక్కడ భారీ వరద సంభవించింది.
भोटेकोसी नदी रसुवामा तिब्बत तर्फबाट ठुलो बाढी प्रवेश गरेकोले अर्को सूचना नआउँदासम्म त्रीशुली नदीको तटिय क्षेत्रका जिल्लाहरु नुवाकोट, धादिङ, चितवन, गोरखा लगायतका स्थानहरूमा उच्च सतर्कता सहित सुरक्षित स्थानमा रहन अनुरोध छ। pic.twitter.com/Zun6icZZCM
— Nepal Police (@NepalPoliceHQ) August 26, 2026
వరద కారణంగా ఊరితోపాటు ఇక్కడ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయింది. దీంతో భారీ నష్టం వాటిల్లిందని నేపాల్ ప్రభుత్వం అంటోంది. ప్రస్తుత వరద నేపథ్యంలో త్రిషూలి నదీ పరివాహక ప్రాంతంతోపాటు నువా కోట్, ధాడింగ్, చిత్వాన్, గోర్ఖా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రజలు ఎగువ ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. ఈ వరద కారణంగా ప్రస్తుతం వెయ్యి మంది వరకు గల్లంతయ్యారు. వారిని రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి. వారికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియరాలేదు.