కాఠ్మాండ్, జనవరి 10: రేప్ కేసులో నేపాలీ కోర్టు ఆ దేశ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ సందీప్ లమిచ్చినేకు 8 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. 2022 ఆగస్టులో కాఠ్మాండ్లోని ఓ హోటల్ గదిలో 17 ఏండ్ల యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడని అతడిపై ఆరోపణలు నమోదయ్యాయి.
అదే ఏడాది అక్టోబర్లో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ కేసులో అతడిని దోషిగా తేల్చుతూ కాఠ్మాండ్ జిల్లా కోర్టు గత ఏడాది డిసెంబర్లో తీర్పు వెలువరించింది. తీర్పును సవాల్ చేస్తూ అతడు ద పాటన్ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడా అతడికి చుక్కెదురైంది. దీంతో న్యాయస్థానం తాజాగా శిక్షను ఖరారు చేస్తూ ఆదేశాలు జారీచేసింది.