నేపాల్ క్యాబినెట్ విస్తరణ.. మంత్రివర్గంలోకి మరో 15 మంది
Nepal Cabinet | నేపాల్ నూతన ప్రధాని, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్-మావోయిస్టు సెంటర్ (CPN-Maoist center ) చైర్మన్ పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ
ఖాట్మండు: నేపాల్ నూతన ప్రధాని, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్-మావోయిస్టు సెంటర్ (CPN-Maoist center ) చైర్మన్ పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ తన క్యాబినెట్‌ను విస్తరించారు. మంత్రివర్గంలోకి కొత్తగా మరో 15 మందిని తీసుకున్నారు. వారిలో 12 మంది మంత్రులుగా, ముగ్గురు సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
ప్రచండ ప్రధానిగా ఎన్నికైన తర్వాత దాదాపు నెల రోజులకే క్యాబినెట్‌ను విస్తరించారు. గత డిసెంబర్ 25న ప్రచండ ప్రధాని ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత రోజే ముగ్గురిచేత ఉప ప్రధానులుగా, నలుగురి చేత మంత్రులుగా ప్రమాణం చేయించారు. సోమవారం సాయంత్రం సంకీర్ణ కూటమిలోని పార్టీల అధ్యక్షులంతా సమావేశమై ఎవరికి ఎన్ని పదవులు అనే విషయంలో ఒక ఒప్పందానికి వచ్చారు.
ఆ ఒప్పందం ప్రకారం ఆయా పార్టీల నేతలకు మంత్రి పదవులు ఇచ్చారు. సంకీర్ణంలోని అతిపెద్ద పార్టీ అయిన CPN-UMLకు రెండు సహాయ మంత్రి పదవులు సహా మొత్తం ఎనిమిది మంత్రి పదవులు దక్కాయి. ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న సీపీఎన్ (మావోయిస్టు సెంటర్)కు ప్రధాని పదవి సహా, ఐదు మంత్రి పదవులు వచ్చాయి. ఇక రాష్ట్రీయ స్వతంత్రపార్టీ, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీలకు మూడేసి చొప్పున మంత్రి పదవులు దక్కాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

