వాషింగ్టన్, మార్చి 30: దాదాపు 16 ఏండ్ల క్రితం గ్రహం హోదాను కోల్పోయిన ఫ్లూటో క్రియాశీలకంగానే ఉన్నదని నాసా శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. అక్కడి ఉపరితలంపైన ఉన్న మంచు పర్వతాలు బద్దలవుతున్నట్టు తెలిపారు. ఇలాంటి మంచు కొండలు సౌర కుటుంబంలో మరే ఇతర గ్రహంలో కనిపించలేదన్నారు.
ఫ్లూటో ఉపరితలం కింద సముద్రాలు ఉండొచ్చని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఫ్లూటో గ్రహంలో మరిన్ని రహస్యాలను వెలికి తీసేందుకు తాజా పరిశోధనలు సాయపడుతాయన్నారు.