NASA | వాషింగ్టన్ డీసీ, ఆగస్టు 7: చంద్రుడి ఉపరితలంపై లైట్ హౌజ్‌ను నిర్మించేందుకు నాసా సమాయత్తం అవుతున్నది. చంద్రుడి పైకి వెళ్లాలనుకొనే వ్యోమగాములు, రోబోలకు ఉపయోగపడేలా ఈ లైట్ హౌజ్ ఏర్పాటుకు నిర్ణయించినట్టు తెలిపింది. దీని కోసం ఇప్పటికే లూనార్ నోడ్ 1 (ఎల్ఎన్-1) నావిగేషన్ వ్యవస్థను పరీక్షించారు.
గత ఫిబ్రవరిలో చంద్రుడిపై 30 నిమిషాల పాటు లైట్‌ను వెలిగించినట్టు నాసా తెలిపింది. లోకల్ నెట్వర్క్ ఏర్పాటు చేసి సుస్థిరమైన లైట్ హౌజ్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతున్నామని వివరించారు.