వాషింగ్టన్ : కేరళ మూలాలున్న నాసా వ్యోమగామి అనిల్ మీనన్ (49) తన తొలి అంతరిక్ష యాత్రలోనే ‘ఐఎస్ఎస్’ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి) బయల్దేరుతున్నారు. మంగళవారం రాస్కోస్మోస్ సూయ జ్ ఎంఎస్ 29 వ్యోమనౌకలో రష్యన్ వ్యోమగాములతో కలిసి ఐఎస్ఎస్కు వెళ్లనున్నారు. ఐఎస్ఎస్లో ఆయన దాదాపు 8 నెలలపాటు గడపనున్నారు.
దీర్ఘకాలంపాటు అంతరిక్ష ప్రయాణం చేస్తే మానవ శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై మీనన్ ప్రయోగాలు నిర్వహించనున్నారు. ప్రస్తుత అంతరిక్ష యాత్రలో ఆయన ఫ్లైట్ ఇంజినీర్‌గా వ్యవహరిస్తున్నారు. అమెరికాలోని మిన్నెసోటాలో పుట్టి పెరిగిన అనిల్ మీనన్ తండ్రి శంకరన్ మీనన్ ఓ ప్రవాస భారతీయుడు.