శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Jul 30, 2020 , 03:20:07

అమెరికాలో విత్తన ప్యాకెట్ల కలకలం

అమెరికాలో విత్తన ప్యాకెట్ల కలకలం

వాషింగ్టన్‌: అమెరికాలో విత్తన ప్యాకెట్ల కలకలం బయల్దేరింది. వాషింగ్టన్‌, వర్జీనియా, టెక్సస్‌ తదితర రాష్ర్టాల్లో గుర్తు తెలియని వ్యక్తులు పలు ఇండ్ల ముందు మెయిల్‌ బాక్సుల్లో విత్తన ప్యాకెట్లు వదిలివెళ్లారు. వాటిపై చైనా భాషలో లేబుళ్లు ఉండటం ఆందోళనను పెంచుతున్నది. ఆ విత్తనాలను ఎవరూ నాటవద్దని అమెరికా ప్రభుత్వం ప్రజలను విజ్ఞప్తి చేసింది. అవి పంటలపై దుష్ప్రభావం చూపించవచ్చని హెచ్చరించింది. విత్తన ప్యాకెట్లను జాగ్రత్తగా భద్రపర్చాలని, వాటిని స్వాధీనం చేసుకొని పరీక్షలు జరుపుతామని అమెరికా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ప్యాకెట్లు ఎక్కడ నుంచి వచ్చాయన్నదానిపై కూడా ఆరా తీస్తున్నారు. దీనిపై చైనా విదేశాంగ శాఖ స్పందించింది. చైనా భాషలో లేబుళ్లు ఉన్నంత మాత్రాన తమపై ఆరోపణలు సరికావని పేర్కొన్నది. logo