Nepal Flood: కొండచరియలు విరిగిపడ్డాయా.. గ్లేసియల్ లేక్ బస్ట్ అయ్యిందా?.. వీడియో
Nepal Flood: నేపాల్లో ఇవాళ ఆకస్మికంగా సంభవించిన వరదల్లో 8 మంది మృతిచెందగా, 105 మంది భారతీయులు గల్లంతు అయ్యారు. అయితే కొండచరియలు విరిగిపడ్డాయా లేక గ్లేసియల్ లేక్ బస్ట్ కావడం వల్ల వరదలు వచ్చాయా అన్న కోణంలో నిపుణులు విశ్లేషిస్తున్నారు. నేపాల్లోని దిగువ ప్రాంతాలకు హెచ్చరిక జారీ చేశారు.
కాట్మాండు: నేపాల్లోని భోటెకోషి నది ఒక్కసారిగా ఉప్పొంగింది. అయితే టిబెట్ వైపు నుంచి ఆ నదిలోకి బురుద నీరు ప్రవేశించింది. దీంతో దిగువ ప్రాంతాలకు హైఅలర్ట్ జారీ చేశారు. భోటికోషి నదిలోకి చైనీస్ వైపు నుంచి నీరు వచ్చినట్లు నిపుణులు అంచనా వేశారు. రాసువాలో అనేక ప్రాంతాలు డ్యామేజ్ అయ్యాయి. గోసాయికుండ రూరల్ మున్సిపాల్టీలో భారీ నష్టం జరిగింది. త్రిశూలీ నది వెంట ఉండే ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గోర్కా, చిత్వాన్ ప్రాంతాలకు కూడా అలర్ట్ ఇచ్చారు. ట్రాన్స్పోర్టు కారిడార్లు అయిన పృథ్వీ హైవే, త్రిభువన్ హైవేతో పాటు రిస్క్జోన్లో ఉన్న ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకు అకస్మాత్తుగా వరదలు వచ్చాయని నిపుణులు ఆరా తీస్తున్నారు. గ్లేసియల్ లేక్ ఔట్బస్ట్ ఫ్లడ్ కారణమా లేక మరేదైనా కారణం ఉందా అని పరీక్షిస్తున్నారు.
ఆకస్మిక వరదలపై చైనా ఓ ప్రకటన చేసింది. జిజాంగ్ ప్రాంతంలో ఉన్న గిజాంగ్ పోర్టు వద్ద మట్టిచరియలు విరిగిపడినట్లు పేర్కొన్నది. అనేక మంది మిస్సింగ్ అయినట్లు కూడా చైనా అధికారిక వార్తా సంస్థ హెచ్చరించింది. చైనాలో ల్యాండ్ పోర్టు వద్ద వరద ప్రభావానికి కమ్యూనికేషన్, పవర్ సప్లయ్లు కూడా నిలిచిపోయాయి. చైనా, నేపాల్ మధ్య గిరాంగ్ పోర్ట్ కీలకమైన పోర్టుగా ఉన్నది. రాసువా జిల్లా ఘటనలో 8 మంది మృతిచెందగా, 105 మంది గల్లంతు అయినట్లు తెలుస్తోంది.
Today, a flash flood has swept through markets, settlements, and hydropower projects along the Bhotekoshi River in Timure and Syabrubesi, Gosainkunda Rural Municipality, Rasuwa District, Bagmati Province, Nepal. pic.twitter.com/DWVsGQpRzV
— Weather Monitor (@WeatherMonitors) August 26, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

