న్యూయార్క్, సెప్టెంబర్ 7: అంగారకుడిపై ఆక్సిజన్ జాడను కనుగొన్నట్టు నాసా తెలిపింది. 2021లో అంగారకుడిపై నాసా ప్రయోగించిన రోవర్‌లోని ఓ పరికరం ఆక్సిజన్‌ను విజయవంతంగా అభివృద్ధి చేసినట్టు వెల్లడించింది. మార్స్ ఆక్సిజన్ ఇన్- ఎస్ఐటీయూ రిసోర్స్ యూటిలైజేషన్ ఎక్సపరిమెంట్ (ఎంవోఎక్స్ఐఈ) పరికరం అంగారకుడి ఉపరితలంపై ఉన్న కార్బన్ డై ఆక్సైడ్‌ను విడగొట్టి 122 గ్రాముల ఆక్సిజన్‌ను అభివృద్ధి చేసినట్టు నాసా వెల్లడించింది. దాన్ని పరీక్షించగా.. 98 శాతం స్వచ్ఛతతో ఉన్నట్టు తెలిపింది.