గురువారం 02 ఏప్రిల్ 2020
International - Mar 19, 2020 , 02:13:38

ప్రపంచంలో సగం మంది విద్యార్థులు ఇండ్లలోనే: యునెస్కో

ప్రపంచంలో సగం మంది విద్యార్థులు ఇండ్లలోనే: యునెస్కో

పారిస్‌: కరోనా ప్రభావంతో 85 కోట్ల మందికి పైగా యువకులు, బాలలు విద్యా సంస్థలకు దూరంగా ఉన్నారని యునెస్కో పేర్కొంది. ఈ వ్యాధి విద్యారంగానికి ‘అసాధారణ సవాల్‌'గా మారిందని తెలిపింది. ఇప్పటికే 102 దేశాలు పూర్తిగా, 11 దేశాలు పాక్షికంగా స్కూళ్లు, యూనివర్సిటీలను మూసివేశాయని, మరికొన్ని దేశాలు ఆ దిశగా ప్రయాణిస్తున్నాయని మంగళవారం యునెస్కో ఒక ప్రకటనలో వెల్లడించింది. పాఠశాలలకు, యూనివర్సిటీలకు, కళాశాలలకు దూరమైన బాలలు, యువత.. ప్రపంచ విద్యార్థుల జనాభాలో దాదాపు సగం ఉంటారని తెలిపింది. 


logo
>>>>>>