ఎవరైనా మ్యాజిక్ ట్రిక్ చేస్తే మనమే షాక్ అవుతాం. అవాక్కవుతాం. ఇక జంతువులు షాక్ అవడంలో వింతేమీ ఉండదు. కానీ.. ఈ కోతి మ్యాజిక్ ట్రిక్‌ను చూసి చేసిన చేష్టలు చూస్తే మాత్రం నవ్వు ఆపుకోలేరు. నిజానికి.. కోతులు అంటేనే చిలిపి చేష్టలకు, అల్లరికి కేరాఫ్ అడ్రస్. వాటి చేష్టలను తట్టుకోవడం ఎవరి తరం కాదు.
తాజాగా మెక్సికోలోని ఓ జూలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. జూకు వెళ్లిన ఓ విజిటర్ కోతి ముందు ఒక మ్యాజిక్ ట్రిక్ చేశాడు. ఆ మ్యాజిక్ ట్రిక్ చూసి కోతి షాక్ అయింది. పిచ్చిపిచ్చిగా ప్రవర్తించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ముందు టిక్‌టాక్‌లో పోస్ట్ చేయగా నెటిజన్లు ఆ వీడియోను చూసి తెగ నవ్వుకున్నారు. తర్వాత అదే వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వీడియో గురించే చర్చ.