Mojtaba Khamenei : ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) త్వరలో ప్రజల ముందుకు రానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. జూలై 23న టెహ్రాన్‌లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) స్మారక సభను మొజ్తబా నిర్వహించనున్నారని సమాచారం. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో నిర్వహించే ఈ కార్యక్రమంలో దేశంలోని కీలక నేతలందరూ పాల్గొంటారని వారు తెలిపారు.
సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మొజ్తబా ఖమేనీ బహిరంగంగా కనిపించలేదు. భద్రత దృష్ట్యా ఇటీవల నిర్వహించిన తండ్రి అంత్యక్రియలకు కూడా దూరంగా ఉన్నారు. రెండు వారాల కిందట తన సతీమణి అంత్యక్రియల్లోనూ మొజ్తబా కనిపించలేదు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉండగా వీరిలో ఒకరు ఫిబ్రవరి 28 నాటి దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడుల్లో తీవ్రంగా గాయపడిన మొజ్తబా చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే నాటి నుంచి కూడా ఇరాన్‌పై దాడులను సోషల్ మీడియా వేదికగా మొజ్తాబా ఖండిస్తూ వస్తున్నారు. శనివారం కూడా సోషల్ మీడియా మొజ్తాబా ఒక పోస్ట్ పెట్టారు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు.