Titanic | టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన టూరిస్ట్ సబ్ మెరైన్ గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Titanic | సముద్రంలో ఉన్న టైటానిక్ (Titanic) మహానౌక శకలాలను చూసేందుకు వెళ్లిన ఓ జలాంతర్గామి (tourist submarine) గల్లంతయ్యింది. అట్లాంటిక్ మహా సముద్రంలో (North Atlantic) ఆచూకీ లేకుండా పోయింది.
Titanic | సముద్రంలో ఉన్న టైటానిక్ (Titanic) మహానౌక శకలాలను చూసేందుకు వెళ్లిన ఓ జలాంతర్గామి (tourist submarine) గల్లంతయ్యింది. అట్లాంటిక్ మహా సముద్రంలో (North Atlantic) ఆచూకీ లేకుండా పోయింది. ప్రమాద సమయంలో సదరు జలాంతర్గామిలో ముగ్గురు పర్యాటకులతో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
జలాంతర్గామితో కమ్యూనికేషన్ కట్ అయిన విషయం తెలియడంతో అమెరికా, కెనడాకు చెందిన రక్షణ బృందాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. గల్లంతైన టైటానిక్ పర్యాటక జలాంతర్గామిలో 70 గంటలకు సరిపడ మాత్రమే ఆక్సిజన్ (oxygen) ఉందని అధికారులు తెలిపారు. మిస్సైన జలాంతర్గామి కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.
1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ శిథిలాలను దగ్గరి నుంచి చూపించేందుకు అమెరికాకు చెందిన ఓషియన్ గేట్ ఎక్స్ పెడిషన్స్ అనే టూరిజం కంపెనీ ఈ టూర్ లను నిర్వహిస్తోంది. దీనికోసం చిన్నపాటి జలాంతర్గామిని వినియోగిస్తోంది. ఈ జలాంతర్గామిలో ముగ్గురు గెస్టులు, ఒక పైలట్, మరో నిపుణుడు.. మొత్తం ఐదుగురు ప్రయాణించే వీలుంది. 22 అడుగులు పొడవున్న ఈ మినీ జలాంతర్గామి 10,431 కిలోల బరువు ఉంటుంది. ఇది 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. కాగా టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లే ఈ యాత్ర టికెట్ ధర 2.50 లక్షల డాలర్లు. అంటే మన కరన్సీ ప్రకారం రూ.2కోట్లకు పైమాటే. ఈ యాత్రలో భాగంగా 400 మైళ్ల దూరం ప్రయాణిస్తారు.
Also Read..
Hardik Pandya | వదినకు రూ.లక్ష కాదు.. రూ. 5 లక్షలు ఇస్తా.. పాండ్యా పెళ్లి వీడియో వైరల్
Kedarnath Temple | కేదార్ నాథ్ ఆలయంలో అపచారం.. శివలింగంపై నోట్లు వెదజల్లిన మహిళ
Chiranjeevi | లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతం పలికిన చిరంజీవి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

