ఓర్లాండో: కొన్ని రోజుల క్రితం కారు ప్రమాదానికి గురైన అర్జెంటీనా అందగత్తె(Miss Venezuela) ఆరియానా వీరా తుది శ్వాస విడిచింది. ఆమె వయసు 26 ఏళ్లు. జూలై 13వ తేదీన ఓర్లాండోలో ఓ ట్రక్కును ఆమె కారు ఢీకొన్నది. నిద్ర మత్తులో డ్రైవ్ చేసి ప్రమాదానికి గురైందామె. మిస్ వెనిజులా టైటిల్ గెలిచిన ఆరియానా.. ప్రమాదం తర్వాత గుండెపోటుకు గురైంది. అక్టోబర్‌లో జరగనున్న మిస్ లాటిన్ అమెరికా కాంపిటీషన్లో ఆమె పాల్గోనాల్సి ఉంది. మోడల్ ఆరియానా రియల్ ఎస్టేట్ రంగంలోనూ పనిచేస్తోంది. ఫుల్ హౌజ్ క్లీనింగ్ సర్వీస్‌ను కూడా ఆమె నడిపిస్తున్నట్లు ఇన్‌స్టా పేజీలో ఉంది.