HomeInternationalMiss Universe Finalist Sienna Weir Died At The Age Of 23 After Tragic Horse Riding Accident
Sienna Weir | ప్రాణం తీసిన గుర్రపుస్వారీ.. మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్ దుర్మరణం
మోడలింగ్ ఏజెన్సీ స్కూప్ మేనేజ్‌మెంట్ కూడా సియెన్నా మరణాన్ని ధృవీకరించింది. ఆమె ఫొటోలను షేర్ చేస్తూ ఎప్పటికీ మన హృదయాల్లో.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
2/6
ప్రముఖ ఆస్ట్రేలియన్ మోడల్, మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్ సియెన్నా వీర్ చిన్న వయసులోనే దుర్మరణం చెందింది.
3/6
గుర్రపు స్వారీ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో సియెన్నా వీర్ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు.
4/6
తన స్వస్థలమైన ఆస్ట్రేలియాలోని విండ్సర్ పోలో గ్రౌండ్స్‌లో ఏప్రిల్ 2న గుర్రపు స్వారీ చేస్తూ సియెన్నా కిందపడిపోయింది.
5/6
ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సియెన్నాను నెలరోజులుగా లైఫ్ సపోర్ట్‌పై ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో లైఫ్ సపోర్ట్ తీసేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. దీంతో ఆమె కన్నుమూసింది.
6/6
2022లో జరిగిన ఆస్ట్రేలియన్ మిస్ యూనివర్స్ పోటీల్లో ఎంపికైన 27 మంది ఫైనలిస్టుల్లో సియెన్నా ఒకరు.
7/6
సిడ్నీ విశ్వవిద్యాలయం నుంచి సియెన్నా ఇంగ్లిష్ లిటరేచర్‌తో పాటు సైకాలజీలో డిగ్రీ చేసింది.