థాయ్‌లాండ్, నవంబర్ 21: మెక్సికో అందాల భామ ఫాతిమా బాష్ మిస్ యూనివర్స్ కిరీటం కైవసం చేసుకుంది. థాయ్‌లాండ్ వేదికగా తీవ్ర ఉత్కంఠగా జరిగిన పోటీలలో మెక్సికో సుందరి విజేతగా నిలిచింది. మిస్ థాయ్‌లాండ్ ఫస్ట్ రన్నరప్, మిస్ వెనిజువెలా సెకండ్ రన్నరప్, మిస్ ఫిలిప్పీన్స్, మిస్ కోట్ డి ఐవోయిర్ నాలుగో, ఐదో స్థానాలను దక్కించుకున్నారు.
ఈ పోటీల్లో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన కనికా విశ్వకర్మ కిరీటం దక్కించుకోలేకపోయారు. మణిక స్విమ్‌సూట్ రౌండ్‌తో టాప్-30 వరకు చేరుకున్నారు. పోటీల సందర్భంగా థాయ్‌లాండ్ అధికారితో ఫాతిమా బాష్ మాటల యుద్ధం, వివాదం నేపథ్యంలో ఆ అధికారి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫాతిమా మిస్ యూనివర్స్‌గా నిలిచింది.