న్యూయార్క్, నవంబర్ 10: ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్ మాజీ భార్య మిలిండా ఫ్రెంచ్ గేట్స్ మళ్లీ ప్రేమలో పడినట్టు అమెరికా మీడియా కోడై కూస్తున్నది. 58 ఏండ్ల మిలిండా 18 నెలల క్రితం బిల్‌గేట్స్ నుంచి విడాకులు తీసుకొన్నారు. బిల్‌గేట్స్‌పై అక్రమ సంబంధాల ఆరోపణలు రావటంతో వీరు విడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మిలిండా టీవీ రిపోర్టర్ జాన్డూప్రేతో ప్రేమలో ఉన్నట్టు ఆన్లైన్ టాబ్లాయిడ్ టీఎంజెడ్ రాసుకొచ్చింది. వీరిద్దరూ ఇటీవల పలుచోట్ల కలిసి కనిపించటంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.