ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మైక్రోసాఫ్ట్

న్యూయార్క్: ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ పేర్కొన్నది. దాదాపు 25 ఏళ్ల క్రితం ఇంటర్నెట్ ఎక్స్పోర్లర్ బ్రౌజర్‌ను క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు నెట్ యూజర్లు అంతా గూగుల్ క్రోమ్, యాపిల్ సఫారీకి అలవాటు పడడంతో.. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు మార్కెట్ తగ్గింది. ఇక విండోస్ 10 నుంచి ఎక్స్‌ప్లోరర్‌కు బదులుగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ చాలా వేగంగా బ్రౌజ్ చేస్తుందని, భద్రతా ప్రమాణాలు కూడా ఎక్కువని, ఐఈతో పోలిస్తే అత్యాధునిక బ్రౌజింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని ఆ సంస్థ వెల్లడించింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో చాలా మంది యూజర్లు కామెంట్లతో ముంచెత్తారు. రిప్ సందేశాలను పోస్టు చేశారు.
జూన్ 15, 2022 నుంచి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్ రిటైర్ అవుతుందని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. ఆ తర్వాత కంపెనీ నుంచి ఆ బ్రౌజర్‌కు ఎటువంటి సపోర్ట్ ఉండదన్నది. కానీ ఎక్స్‌ప్లోరర్ ఆధారంగా పనిచేస్తున్న వెబ్సైట్లు, అప్లికేషన్లు మాత్రం.. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌తో 2029 వరకు పనిచేయనున్నాయి. ప్రస్తుత మార్కెట్లో గూగుల్‌కు చెందిన క్రోమ్ బ్రౌజర్‌ను 65 శాతం వినియోగిస్తున్నారు. ఇక మార్కెట్ షేర్లో 19 శాతం యాపిల్ కంపెనీకి చెందిన సఫారీ బ్రౌజర్ ఉన్నది. 3.59 శాతంతో ఫైర్ఫాక్స్, 3.39 శాతంతో ఎడ్జ్ బ్రౌజర్లు ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

