Obesity | వార్సా, మార్చి 13: పెండ్లి ప్రభావం వల్ల మగవాళ్లు ! వార్సాలోని నేషనల్ కార్డియాలజీ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల తాజా పరిశోధన ఈ విషయాన్ని తెలిపింది. పెండ్లయ్యాక పురుషులు వారి భార్యలతో పోలిస్తే 3.2 రెట్లు ఊబకాయులవుతున్నట్టు తెలిసింది. పెండ్లి వల్ల పురుషులు 62 శాతం, మహిళలు 39 శాతం లావెక్కుతున్నారు. ఆహారం తీసుకొనే పరిమాణం పెరగడం, బయటి తిండి, వ్యాయామం తగ్గిపోవడం లాంటి కారణాల వల్ల పైండ్లెన పురుషులు లావైపోతున్నారని వారు తెలిపారు.
అదే మహిళల విషయానికి వస్తే సామాజిక ఒత్తిళ్ల కారణంగా వారు తమ బరువు పెరగకుండా జాగ్రత్త వహిస్తారని వెల్లడించారు.