వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సతీమణి, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్(Melania Trump) వైట్‌హౌజ్‌లో ఏఐపై జరిగిన సమావేశానికి ఓ హ్యూమనాయిడ్ రోబోతో కలిసి హాజరయ్యారు. కృత్రిమ మేధపై జరిగిన సదస్సుకు రోబోతో కలిసి మెలానియా వచ్చారు. ఆ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన ఫస్ట్ లేడీలు అనేక మంది హాజరయ్యారు. రాజకీయవేత్తలు, సెలబ్రిటీలతో కళకళలాడే వైట్‌హౌజ్‌లో ఇప్పుడు రోబో సందడి చేసింది. ఆ రోబోకు 11 భాషలు తెలుసు. అన్ని భాషల్లో ఆ రోడో అతిథులకు స్వాగతం పలికింది. స్వాగతం అని బెంగాలీ భాషలోనూ ఆ రోబో పలికింది.
అమెరికాకు చెందిన ఫిగర్ అనే రోబోటిక్స్ కంపెనీ ఆ రోబోను నిర్మించింది. ఫిగర్ 3గా ఆ రోబోను పిలుస్తున్నారు. ఫ్రాన్స్, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన ఫస్ట్ లేడీలు కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. అయితే ఇంటి అవసరాలను తీర్చే రీతిలో ఈ రోబోను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ రోబో మనిషి తరహాలో నడుస్తుంది. దాని చేతులకు కెమెరాలను అమర్చారు. ఫిగర్ 3 రోబో.. డిష్‌వాషర్‌ను లోడ్ చేయగలదు, లాండ్రీ పెట్టగలదు, బొమ్మలను పోగు చేయగలదు, బట్టలను మడత పెట్టగలదని తెలుస్తోంది.
🚨🇺🇸Melania Trump shows up at a summit accompanied by a humanoid AI robot.
Future ladies and gentlemen
pic.twitter.com/zNXjJZR7gS— Adi Baz (@AdiBazi16) March 25, 2026