వర్జీనియా: అమెరికాలోని వర్జీనియాలోని శతాధిక బామ్మ తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నారు. చదువుకు వయసు అడ్డుకాదని నిరూపిస్తూ 104 ఏండ్ల జిన్నీ హిస్లాప్ ఎట్టకేలకు మాస్టర్స్ డిగ్రీని పొందారు. స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి పొందిన మాస్టర్స్ డిగ్రీని చూసి మురిసిపోతున్న బామ్మగారు.. బాయ్‌ఫ్రెండ్‌ను 1940లో వివాహం చేసుకున్న తర్వాత చదువుకు ఫుల్స్టాప్ పెట్టానని, తర్వాత కుటుంబ బాధ్యతల కారణంగా చదువుకునే అవకాశం దక్కలేదన్నారు. ఇన్నాళ్లకు తన జీవితేచ్ఛ నెరవేరిందని ఆనందంతో చెప్పారు.