అమెరికాలో నిలిచిన వేలాది విమానాలు
సాంకేతిక సమస్యతో అమెరికావ్యాప్తంగా వేలాది విమానాలు రద్దయ్యాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల కమ్యూనికేషన్ వ్యవస్థలో అంతరాయం తలెత్తడంతో వేలాది విమానాలు రద్దు, ఆలస్యం కావడంతో 15 లక్షల మందికిపైగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
- 15 లక్షల మందికి ఇబ్బందులు
- 4,700 సర్వీసులు రద్దు.. 10,000 ఫ్లైట్లు ఆలస్యం
- నాలుగు గంటలకుపైగా కొనసాగిన ప్రతిష్ఠంభన
- సైబర్ దాడి కాదు.. సాంకేతిక సమస్యేనన్న అధికారులు
వాషింగ్టన్: సాంకేతిక సమస్యతో అమెరికావ్యాప్తంగా వేలాది విమానాలు రద్దయ్యాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల కమ్యూనికేషన్ వ్యవస్థలో అంతరాయం తలెత్తడంతో వేలాది విమానాలు రద్దు, ఆలస్యం కావడంతో 15 లక్షల మందికిపైగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. 2023 తర్వాత ఇంత భారీగా విమానాలు నిలిచిపోవడం ఇదే తొలిసారి. అంతకుముందు 2001 సెప్టెంబర్ 11న ఉగ్రదాడి అనంతరం ఇలాంటి పరిస్థితి ఏర్పడింది.
ప్రాంతీయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో కమ్యూనికేషన్ సమస్యల వల్ల ‘అసాధారణ పరిస్థితులు’ ఏర్పడ్డాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) అధికారులు వెల్లడించారు. అయితే, కొన్ని గంటల తర్వాత గగనతలాన్ని తిరిగి తెరిచారు. దేశవ్యాప్తంగా అమలు చేసిన విమానాల నిలిపివేతను ఎత్తివేశారు. ఫ్లైట్రాడార్24 వెల్లడించిన కథనం మేరకు అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 4 గంటలకు ఈ అంతరాయం ఏర్పడటంతో 4,700కు పైగా విమానాలు రద్దయ్యాయి. 10 వేల సర్వీసులు ఆలస్యమయ్యాయి. శనివారం 14న మరో 700 విమానాలు రద్దయ్యాయి. నాలుగు గంటలకు పైగా కొనసాగిన విమానాల నిలిపివేత తర్వాత ఎయిర్‌లైన్స్ తమ షెడ్యూళ్లను సాధారణ స్థితికి తీసుకురావడానికి కొన్ని రోజులు పట్టవచ్చని విశ్లేషకులు చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది.
పలు విమానాల దారి మళ్లింపు
ఓహేర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, డాలస్ ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రొనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లకు అనేక విమానాలను దారి మళ్లించారు. తూర్పు కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల తర్వాత అమెరికా విమానాశ్రయాల నుంచి 15 లక్షల మందికి పైగా ప్రయాణికులతో సుమారు 11,000 విమానాలు బయలుదేరాల్సి ఉంది. దీంతో మరిన్ని రద్దు, విమానాల దారి మళ్లింపులు జరిగే అవకాశం పెరిగింది. దీంతో ప్రయాణికుల షెడ్యూల్ తారుమారయ్యాయి.
సైబర్ దాడి కాదు
పాతబడిన పరికరాల వల్లే అంతరాయం ఏర్పడిందని రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ తెలిపారు. సైబర్ దాడి జరిగినట్లు ఎలాంటి సంకేతాలు లేవని, మైక్రోసాఫ్ట్ సేవల అంతరాయంతో సంబంధం ఉందన్న సూచనలను హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి మార్క్వేన్ ముల్లిన్ తోసిపుచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

