వీడని 22ఏ చిక్కులు
రాష్ట్రంలో 22ఏ నిషేధిత జాబితా చికులు, అధికారుల వేధింపులు పరిమితి దాటిపోయింది. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న యాజమాన్య హక్కులను ఒక్క జీవోతో కాలరాసిన కాంగ్రెస్ సర్కారు...
-
కోర్టు ఆదేశాలు బేఖాతరు..రిజిస్ట్రేషన్ చేయని యంత్రాంగం
-
ప్రైవేటు ఆస్తులపై హక్కుల కోసం బాధితుల తిప్పలు
సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ)..రాష్ట్రంలో 22ఏ నిషేధిత జాబితా చికులు, అధికారుల వేధింపులు పరిమితి దాటిపోయింది. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న యాజమాన్య హక్కులను ఒక్క జీవోతో కాలరాసిన కాంగ్రెస్ సర్కారు… ఇప్పుడు న్యాయపరంగా పోరాడి గెలిచిన ఫలితం లేకుండా చేస్తున్నది. ప్రభుత్వ అనుమతులు, కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో బాధితులు ఐదు నెలలుగా కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతూ నరకయాతన పడుతున్నారు.
నిషేధిత జాబితాలో లక్షలాది ఆస్తులను చేర్చిన ప్రభుత్వం.. వాటిని అమ్ముకోలేకుండా చేసింది. అయితే అత్యవసరంగా విక్రయించుకోవడానికి బాధితులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. యాజమాన్య హక్కులపై కోర్టు లు స్పందించి, స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా కింది స్థాయి సిబ్బంది వాటిని అమలు చేయడానికి వెనుకడగు వేస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా యూఎల్సీ, మిగులు భూములు, జీవో నం. 59 విషయంలో ప్రభుత్వ అధికారుల తీరుతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిషేధిత జాబితాలో చేర్చడమే అన్యాయమంటే.. కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు. దశాబ్దాల కాలం నుంచి వారసత్వంగా సంక్రమించిన యాజమాన్య హక్కులను రద్దు చేసిన ప్రభుత్వం..
కోర్టు ఆదేశాలను విస్మరిస్తున్నది. ప్రధానంగా యూఎల్సీ, జీవో నం. 59, మిగులుభూముల అంశాల్లో సర్కార్ నిబంధనలు, అధికారుల తీరు భారీ వ్యత్యాసం ఉంది. ఒక సర్వే నంబర్లోని కొంత భూమి యూఎల్సీ, సర్ప్లస్ ల్యాండ్‌గా చూపుతున్న అధికారులు..ఆ సర్వే నంబర్ మొత్తాన్ని ఎలాంటి సర్వే చేయకుండానే నిషేధించారు. దీంతో తమ ఆస్తులకు నిషేధిత జాబితా నిబంధనలు వర్తించవు అంటూ కోర్టులను ఆశ్రయించారు. రెవెన్యూ శాఖలో జరిగిన తప్పిదాన్ని గుర్తించిన కోర్టులు బాధితులకు ఊరటనిచ్చేలా స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాయి. కానీ ఉత్తర్వులను అధికారులు అమలు చేయడం లేదు. దీంతో కోర్టుల చుట్టూ తిరిగిన తమ యాజమాన్య హక్కులకు దక్కడం లేదని వాపోతున్నారు.
ఉదాహరణకు మేడ్చల్-మలాజిగిరి జిల్లా, ఘట్ కేసర్ మండలంలోని పీర్జాదిగూడ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 33-44 లోని పలు కాలనీ వాసులు ఈ తరహా ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు. ప్రాపర్టీలన్నింటిపై బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి, తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అర్హులని కోర్టు ద్వారా స్పష్టమైన తీర్పులు పొందారు. కోర్టులు చెప్పినట్లుగా సంబంధిత రెవెన్యూ ధ్రువీకరణ పత్రాలను రిజిస్ట్రేషన్ సిబ్బందికి చూపిన అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు.

ఐదు నెలలుగా ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు
న్యాయస్థానం అనుకూలంగా తీర్పునిచ్చినప్పటికీ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది నిబంధనల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని మియాపూర్‌కు చెందిన సయ్యద్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై లేదా’? అని ప్రశ్నిస్తున్నారు. ఐదు నెలలుగా రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారుల నుంచి కనీస స్పష్టత లేకపోవడంతో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
22ఏ జాబితా తప్పుల తడకగా మారడం, కోర్టు తీర్పులను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు మొండిగా వ్యవహారించడంతో సామాన్యుల పాలిట శాపంగా మారింది. ఇప్పటికైనా ఆయా జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమాలను దృష్టి పెట్టాలని బాధితులు వేడుకుంటున్నారు. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా నిషేధిత జాబితా బాధితులకు తక్షణమే ఊరటనిచ్చేలా రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ పెండింగ్ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

